కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతుల సంతకాల సేకరణ చేపట్టనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. రేపటి నుంచి ఈ నెల 10 వరకు మండలానికి 2వేల మంది రైతులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి వెల్లడించారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే... పరిహారం లేదని, మద్దతు ధర కూడా అమలు చేయడం లేదని పొన్నం ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధరల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. కేసీఆర్, మోదీ ఇద్దరు వ్యవసాయ, రైతు వ్యతిరేకులని విమర్శించారు.
ఇదీ చూడండి: 'దుబ్బాకలో పెద్దఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు'