ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు లేఖ రాశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పీఠం బీసీలకు ఇవ్వాలని కోరారు. సీనియర్ల అభిప్రాయాలను గౌరవిస్తానని.. అందరి సూచనల ఆధారంగా పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీని నడుపుతానని రాహుల్ గాంధీ పేర్కొనడం స్వాగతించదగ్గ అంశమని తెలిపారు.
తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలను తెలియజేస్తూ.. బీసీలకు ఎందుకు పీసీసీ అధ్యక్ష పీఠం ఇవ్వాలో వివరించినట్లు వి.హనుమంత రావు చెప్పారు. ఎక్కువ జనాభా కలిగిన బీసీలు పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. బయట పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే.. ఏం జరుగుతుందో ఉదాహరణతో కూడిన లేఖ రాసినట్లు వివరించారు.
ఇదీ చదవండి: 'భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇన్ని సంక్షేమ పథకాలున్నాయా..?'