ETV Bharat / city

హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ఏం చేసిందంటే..?: షబ్బీర్ అలీ - హైదరాబాద్ అభివృద్ధిపై షబ్బీర్ అలీ వ్యాఖ్యాలు

ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ఏం చేసిందన్న దానిపై... కాంగ్రెస్ రూపొందించిన కరపత్రాన్ని గాంధీ భవన్​లో ఆవిష్కరించారు.

congress senior leader shabbir ali about hyderabad development in congress government
హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ఏం చేసిందంటే..?: షబ్బీర్ అలీ
author img

By

Published : Nov 27, 2020, 11:20 AM IST

తెరాస, భాజపా, ఎంఐఎం విమర్శలు, ప్రతి విమర్శలను మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఖండించారు. ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. హైదరాబాద్‌ అభివృద్ధికి కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందన్న దానిపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, షబీర్‌ అలీ, మధుయాస్కీ గౌడ్‌ గాంధీభవన్‌లో కరపత్రాలను విడుదల చేశారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల కాలంలో... శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, కృష్ణ, గోదావరి మంచినీటి తరలింపు వరకు అన్ని అభివృద్ధి పనులు కాంగ్రెస్‌ హయాంలోనే జరిగాయని వివరించారు.

హైదరాబాద్​కు తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని షబ్బీర్ అలీ విమర్శించారు. ఎన్నికల ప్రచారానికి వస్తున్న కేంద్రమంత్రులు... వరదల సమయంలో ఎందుకు రాలేదని కేటీఆర్‌ ప్రశ్నించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రగతిభవన్‌కు కూతవేటు దూరంలో వరదలతో తీవ్ర ఇబ్బంది పడుతున్న బాధితులను ఎందుకు కేసీఆర్​ పలకరించలేదని ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్న సర్జికల్ స్ట్రైక్ ఎవరి మీద చేస్తారో తెలుసా అని నిలదీశారు.

ఇదీ చూడండి: జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచిన కాంగ్రెస్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.