ETV Bharat / city

కౌలు రైతులకు రైతు బంధు వర్తింపజేయండి: ఎంపీ కోమటిరెడ్డి

రైతు ఆత్మహత్యలను నిలువరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు. కౌలు రైతులకూ రైతు బంధు వర్తింపజేయాలని డిమాండ్​ చేశారు.

mp komati reddy
ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ
author img

By

Published : Mar 28, 2021, 6:05 PM IST

రైత‌న్నల ఆత్మహ‌త్యలు రాష్ట్రానికి మంచివి కావని కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అన్నదాతను ఆదుకొనేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాశారు. తెరాస ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. పాస్​బుక్​ ఉన్న రైతులకు అర‌కొర డ‌బ్బులిస్తున్న స‌ర్కార్.. కౌలు రైతుల‌ను అసలు ప‌ట్టించుకోవ‌ట్లేదని విమర్శించారు.

చిన్న, స‌న్నకారు రైతులు పండించిన పంట‌కు మ‌ద్దతు ధ‌ర లేక క‌న్నీరు పెడుతుంటే.. కౌలు రైతులు అప్పులు తీర్చలేక ఉరికొయ్యల‌కు వేళాడుతున్నారని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ బాగుప‌డ‌వన్న ఆయన.. తక్షణమే అన్నదాతల ఆత్మహ‌త్యలను నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. కౌలు రైతుల‌కూ రైతుబంధు ప‌థ‌కం అమ‌లు చేయాల‌ని కోరారు. ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించాలని కోరారు.

ఇవీచూడండి: లాభసాటి పంటలపై రైతులు దృష్టి పెట్టాలి: నిరంజన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.