ETV Bharat / city

కరోనా చికిత్స బిల్లులను సీఎం సహాయనిధి నుంచి చెల్లించండి: జీవన్​రెడ్డి - mlc jeevan reddy comments on elections in telangana

రాష్ట్రంలోని కరోనా చికిత్స బిల్లులను సీఎం సహాయనిధి నుంచి చెల్లించాలని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి సూచించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ కొరత లేకుండా చూడాలని కోరారు. అందరికీ కరోనా టీకాను ఉచితంగా అందించాలని డిమాండ్​ చేశారు.

jeevanreddy
కేంద్ర ప్రభుత్వంపై జీవన్​రెడ్డి ఆగ్రహం
author img

By

Published : Apr 22, 2021, 4:27 PM IST

ప్రజలకు విద్య, వైద్యం వంటి హక్కులను కాపాడడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని మండిపడ్డారు. కరోనా మందుల కొరత ఏర్పడిందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్​ పథకం ఇంతవరకు అమలుకు నోచుకోలేదని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న డిమాండ్‌ను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆక్సిజన్​ కొరత లేకుండా చూడాలి..

ప్రైవేట్​ ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని జీవన్​రెడ్డి సూచించారు. అధిక ఫీజుల వసూళ్లను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. కరోనా బారిన పడ్డ పేదలకు.. సీఎం సహాయ నిధి నుంచి పూర్తిగా బిల్లులు చెల్లించాలని.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ కొరత లేకుండా చూడాలని సూచించారు. అందరికీ ప్రభుత్వమే కరోనా టీకాను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

ఇప్పుడు ఎన్నికలు అవసరమా?

కరోనా ఇంత తీవ్రంగా ఉంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియడం లేదా.. అని జీవన్​రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి సమయంలో మినీ పురఎన్నికలు నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం భేషజాలకు పోకుండా వాయిదా వేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వంపై జీవన్​రెడ్డి ఆగ్రహం

ఇవీచూడండి: 'ఆక్సిజన్, టీకాలు, రెమ్​డెసివిర్​ విషయంలో కేంద్రం వివక్ష'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.