ETV Bharat / city

రాజ్​ భవన్​ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ యత్నం.. నేతల అరెస్టు

author img

By

Published : Jul 27, 2020, 12:45 PM IST

Updated : Jul 27, 2020, 1:31 PM IST

'స్పీక్​ అప్​ ఫర్​ డెమోక్రసీ' పేరుతో రాజ్​ భవన్​ వద్ద నిరసనకు బయలుదేరిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను భాజపా కూలదోస్తుందని ఆరోపించారు.

congress leaders try to protest at gandhi bhavan and arrest
రాజ్​ భవన్​ వద్ద నిరసనకు కాంగ్రెస్ శ్రేణుల యత్నం.. అరెస్టు

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ... కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదొస్తుందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 'స్పీక్​ అప్​ ఫర్​ డెమోక్రసీ' పేరుతో రాజ్​భవన్​ వద్ద నిరసనకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. ప్రదర్శనకు బయలుదేరిన శ్రేణులను గాంధీ భవన్ బయట పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు, కార్యకర్తలు గాంధీ భవన్ ఆవరణలోనే బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ప్రతినిధులు గవర్నర్​ను కలిసేందుకు అనుమతి కోరారు.

భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ హనుమంతరావు, గ్రేటర్ అధ్యక్షుడు అంజన్​ కుమార్ యాదవ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్​ కుమార్ యాదవ్, పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి తదితరులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్​కు తరలించారు.

రాజ్​ భవన్​ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ యత్నం.. అరెస్టు

ఇదీ చూడండి: తెలంగాణలో కొత్తగా 1,473 కరోనా కేసులు.. 8 మంది మృతి

Last Updated : Jul 27, 2020, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.