ETV Bharat / city

నెహ్రూ కీర్తిని తగ్గించేందుకు భాజపా కుట్ర: ఉత్తమ్ - uttam kumar reddy participated in nehru birthday celebrations

హైదరాబాద్​ గాంధీభవన్​లో జవహర్​లాల్​ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, వి.హన్మంతరావు తదితరులు పాల్గొని నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం... రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

congress leaders tribute to jawaharlal nehru in gandhi bhavan

author img

By

Published : Nov 14, 2020, 12:11 PM IST

'నెహ్రూ కృషి వల్లే దేశప్రజలు ఈ స్థాయిలో బతుకుతున్నారు...'

మాజీ ప్రధాని జవహర్​లాల్ నెహ్రూ జయంతి వేడుకలు హైదరాబాద్​ గాంధీభవన్​లో ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, వి.హన్మంతరావు తదితరులు... నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ప్రజలు ఈ స్థాయిలో బతుకుతున్నారంటే నెహ్రూ చేసిన కృషి వల్లేనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

నెహ్రూ కీర్తిని తగ్గించి.. అప్రతిష్ఠ పాలు చేసేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.... నెహ్రూ ముద్రను చేరపలేరన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి: వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై రేపు సీఎం కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.