ETV Bharat / city

డీజీపీని కలిసేందుకు యత్నించిన కాంగ్రెస్​ నేతలు అరెస్ట్​ - aicc secretary arrested in hyderabad

ఎంపీ రేవంత్​రెడ్డి అరెస్ట్​ అంశంపై డీజీపీని కలిసేందుకు వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​ మరికొందరి నేతలను పోలీసులు అరెస్ట్​ చేశారు. వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినా అరెస్ట్​ చేయడం దారుణమని కాంగ్రెస్​ నేతలు మండిపడ్డారు.

congress leaders arrested whom trying to meet dgp mahender reddy
డీజీపీని కలిసేందుకు యత్నించిన కాంగ్రెస్​ నేతలు అరెస్ట్​
author img

By

Published : Aug 22, 2020, 6:32 PM IST

డీజీపీ మహేందర్​రెడ్డిని కలిసేందుకు వచ్చిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. డీజీపీతో భేటీకి కాంగ్రెస్ నాయకులకు ముందస్తు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని గోషామహల్​ పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

శ్రీశైలం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించేందుకు యత్నించిన ఎంపీ రేవంత్​రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవిలను అరెస్టు చేశారు. ఈ అంశంపై కుందన్‌బాగ్‌లోని డీజీపీ నివాసంలో ఆయన్ను కలిసేందుకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌, కాంగ్రెస్ నేత కిరణ్‌కుమార్‌ వెళ్లగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చినట్లు చెప్పినా.. అరెస్ట్​ చేశారని సంపత్​కుమార్​ మండిపడ్డారు.

డీజీపీని కలిసేందుకు యత్నించిన కాంగ్రెస్​ నేతలు అరెస్ట్​

ఇవీచూడండి: శ్రీశైలం అగ్నిప్రమాదస్థలికి వెళ్తుండగా రేవంత్​ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.