హైదరాబాద్ మహానగరం అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తెలిపారు. తెరాస ప్రభుత్వం చేసిందేమిలేదని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న రేవంత్‌రెడ్డి... చంపాపేట్, లింబోజుగూడ డివిజన్‌లలో పర్యటించారు.
అబద్ధపు ప్రచారానికి తెరాస బ్రాండ్ అంబాసిడర్గా మారిందని రేవంత్ ఆరోపించారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టటమే కాకుండా... పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రేవంత్‌రెడ్డి ప్రజలను కోరారు. ప్రచారంలో లింగోజుగూడ కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి, చంపాపేట అభ్యర్థితో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.