మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర ఎన్నికల బృందాన్ని కలిశారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, అధికారుల పనితీరుపై ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయొద్దని సీఈసీని కోరినట్లు మర్రి తెలిపారు. ఈవీఎంలు వినియోగించే విధానంపై సూచనలు చేశామని పేర్కొన్నారు. సీఈసీ సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.
కేసీఆర్ నియమావళి ఉల్లంఘించారు
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సమస్యల అంశానికి ప్రచార మాధ్యమాన్ని వాడుకుని ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని మర్రి ఆరోపించారు. వీవీ ప్యాట్లలో వివిధ పార్టీల గుర్తులు అధిక సమయం కన్పించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
ఇదీ చదవండి :నేత కార్మికులను ఆదుకుటాం: శ్రీనివాస్ గౌడ్