కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం చాలా బాగుందని, సోనియా గాంధీ మరి కొంతకాలం పార్టీ అధ్యక్షులుగా ఉండి పూర్తిస్థాయి అధ్యక్షులను నియమించాలన్నది పార్టీకి మేలు చేస్తుందని మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు కొందరు గోతికాడ నక్కల్లాగా ఎదురు చూసిన వారికి సీడబ్ల్యూసీ నిర్ణయం ఆశాభంగం కలిగించిందని ఒక ప్రకటనలో తెలిపారు.
130 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం కలిగిన పార్టీ తమదని... ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావడం కొత్త కాదని అన్నారు. గతంలోనూ పలుమార్లు ఉత్పన్నమై సమసిపోయాయని పేర్కొన్నారు. ప్రజల కోసం, ప్రజల ఆకాంక్షల మేరకు మాత్రమే కాంగ్రెస్ పని చేస్తుందని వివరించారు. కాంగ్రెస్ పని అయిపోయిందని అనుకున్న వాళ్లకు... సీడబ్ల్యూసీ నిర్ణయం చెంపపెట్టని తెలిపారు.