ఓ జర్నలిస్ట్‌పై దాడి కేసులో రాజకీయ కక్షతోనే తనపై అక్రమ కేసులు పెట్టించారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫోన్ చేయించి... డీజీపీ ప్రమేయంతో కేసులు పెట్టి జైలులో పెట్టాలని చూశారని ఆక్షేపించారు. మొత్తం తనపై ఏడు కేసులు పెట్టారని... అందులో పోలీసుల విధులకు ఆటకం కలిగించానని నాన్ బెయిలేబుల్ కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ అక్రమ కేసు గురించి న్యాయమూర్తి ముందు వివరించానని... మిగతా కేసులపై తనకు బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపారు.
ట్యాంక్ బండ్‌పై జరిగిన కొవొత్తుల నిరసనలో ఉత్తమ్ కుమార్ రాగానే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు రావటం వల్ల... వారిని తోసివేశానని అందులో ఎఎన్ఐ రిపోర్టర్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా... రిపోర్టర్ తనతో దురుసుగా ప్రవర్తించడం వల్ల... తానూ దురుసుగా మాట్లాడాన్నారు. ఈ క్రమంలోనే తమ కార్యకర్తలు రిపోర్టర్‌పై దాడి చేశారని తెలిపారు. తాను జర్నలిస్టు మిత్రులతో స్నేహపూర్వకంగా ఉంటానాని... రిపోర్టర్‌పై దాడి అనుకోకుండా జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొంటున్నానని ప్రభుత్వం తనపై కక్ష సాధించాలని చూసిందని తెలిపారు.