సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు భూమన్న అరెస్టు అప్రజాస్వామికమని కాంగ్రెస్, తెలంగాణ జన సమితి పార్టీ నేతలు మండిపడ్డారు. ఆయనపై పెట్టిన కేసులు ఉపసంహరించి, తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత గూడూరు నారాయణరెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం, తదితరులు డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీ జితేందర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ విషయంపై విచారణ జరిపి, న్యాయం చేస్తానని అదనపు డీజీ హామీ ఇచ్చినట్టు నేతలు తెలిపారు.
ఇవీ చూడండి: 'భూమన్న యాదవ్‌ను వెంటనే విడుదల చేయాలి'