ETV Bharat / city

వాణిజ్య వాహనాల పన్ను చెల్లింపుపై అయోమయం

author img

By

Published : Apr 25, 2020, 8:33 AM IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాణిజ్య వాహనాల పన్ను చెల్లింపుపై అయోమయం నెలకొంది. రవాణా పన్ను చెల్లింపు గడువు ఏప్రిల్‌ 30వ తేదీతో ముగుస్తుంది. నెల రోజులుగా కరోనా కారణంగా అనేక వాహనాలు నిలిచిపోయాయి. పన్ను చెల్లించాలనుకున్నా మీసేవా కేంద్రాలు పనిచేయడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పన్నును రద్దు చేయడం సాధ్యం కాదని అధికారులు తెల్చి చెప్పారు.

confusion on commercial vehicle tax payments
వాణిజ్య వాహనాల పన్ను చెల్లింపుపై అయోమయం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాణిజ్య వాహనాల పన్ను చెల్లింపుపై అయోమయం నెలకొంది. ఇందుకు సంబంధించి గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. రాష్ట్రంలో సుమారు అయిదున్నర లక్షల వాహనాలు ఉన్నాయి. వీటికి ప్రతి మూణ్నెల్లకు ఒకదఫా రవాణా పన్ను చెల్లించాలి. ఆ గడువు ఏప్రిల్‌ 30వ తేదీతో ముగుస్తుంది. నెల రోజులుగా కరోనా కారణంగా అనేక వాహనాలు నిలిచిపోయాయి.

ప్రస్తుతం ఎవరైనా వాహన యజమానులు పన్ను చెల్లించాలన్నా మీసేవా కేంద్రాలు పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో మే ఒకటో తేదీ నుంచి అయితే 50 శాతం అపరాధ రుసుముతో పన్ను కట్టాలి. అదే అధికారుల తనిఖీలో అధికారులు పట్టుకుంటే 100 శాతం చెల్లించాల్సిందే. ప్రస్తుతం వ్యాపారం లేనందున పన్ను మినహాయింపు ఇవ్వాలని వాహనదారులు రవాణాశాఖను కోరారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పన్నును రద్దు చేయడం సాధ్యం కాదని అధికారులు చెప్పారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత నుంచి నెల రోజుల్లోగా పన్ను చెల్లించేందుకు వెసులుబాటు కల్పించాలని రవాణాశాఖ నుంచి ప్రతిపాదన వచ్చిందని ఆర్థిక శాఖ వర్గాల సమాచారం.

ఇవీ చూడండి: టార్పాలిన్ల సరఫరాకు చేతులెత్తేసిన గుత్తేదారు.. టెండర్లు రద్దు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.