ETV Bharat / city

వైకాపాలో భగ్గుమన్న వర్గపోరు... అనిల్, కాకాణి మధ్య విభేదాలకు కారణాలేంటి? - ap latest news

Anil-Kakani conflicts: ఏపీలోని సింహపురి వైకాపాలో మంత్రివర్గ విస్తరణ చిచ్చు గట్టిగానే రాజుకున్నట్లు కనిపిస్తోంది. తాజా మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ వర్గపోరు మరింత ముదిరేలా అనిపిస్తోంది. కాకాణి వ్యతిరేక వర్గం ఏకం కాబోతోందనే ఊహాగానాలు నిజం చేస్తూ మాజీ మంత్రి అనిల్‌... మంత్రి పదవి ఆశించి భంగపడిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. ఇంతకీ నెల్లూరు వైకాపాలో ఏం జరుగుతోంది. కాకాణితో విభేదాలకు కారణాలేంటి?

conflicts-between-minister-kakani-and-former-minister-anil

author img

By

Published : Apr 15, 2022, 9:01 AM IST

Updated : Apr 15, 2022, 9:12 AM IST

వైకాపాలో భగ్గుమన్న వర్గపోరు... అనిల్, కాకాణి మధ్య విభేదాలకు కారణాలేంటి?

Anil-Kakani conflicts: మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి తనపట్ల చూపిన ప్రేమ, వాత్సల్యం, సహకారం ఇప్పుడు రెండింతలు అందిస్తానని.. తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ అన్నారు. అయితే నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి తెలిసిన వాళ్లందరికీ.. ఆ సహకారంఎంత కారంగా ఉంటుందో స్పష్టమైన అవగాహన ఉంది. అనిల్‌కు, కాకాణికి ఎప్పటినుంచో సఖ్యత లేదన్నది వైకాపాలో బహిరంగ రహస్యమే. కాకపోతే మంత్రివర్గ విస్తరణ తర్వాత ఒకరికి పదవి రావడం,.. మరొకరికి ఊడడం ఇద్దరి మధ్య విభేదాలను రచ్చకీడ్చింది. ప్రమాణస్వీకారానికి తనను పిలవలేదని అనిల్‌ బాహాటంగానే చెప్పేశారు. ఈ క్రమంలోనే నెల్లూరు హరనాధపురం సెంటర్‌లో కాకాణి అభిమానులు ఏర్పాటు చేసిన ప్లెక్సీని రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడం వివాదాస్పదమైంది. ఇది అనిల్‌ అభిమానుల పనేనంటూ.. వైరివర్గం ఆరోపించడం.. రాజకీయాన్ని వేడెక్కించింది.

కోటంరెడ్డి, అనిల్ భేటీ: వైకాపాలో కాకాణి వ్యతిరేకులంతా ఏకమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.ఎమ్మెల్యేలూ రెండు వర్గాలుగా విడిపోయారనే వాదన లేకపోలేదు. ఇందుకు అనుగుణంగానే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మాజీ మంత్రి అనిల్‌ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గోవర్ధన్ రెడ్డికి, కోటంరెడ్డికి మధ్య కూడా పాత విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కాకాణితో విభేదాలున్నఅనిల్‌, కోటంరెడ్డి ఏం చర్చించారనేది ఉత్కంఠ రేపుతోంది. వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కాకాణి తొలిసారి ఈ నెల 17న నెల్లూరు జిల్లాకు రాబోతున్నారు. ఘనంగా స్వాగతం పలికేందుకు కాకాని వర్గం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఐతే అదేరోజు అనిల్ వర్గం నెల్లూరులో భారీ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఎప్పటినుంచో విభేదాలు : కాకాణి, అనిల్ మధ్య విభేదాలు ఇప్పటివికావు. అనిల్ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సాగునీటి కాల్వల ముందస్తు నిర్వహణ సరిగాలేదంటూ కాకాణి జిల్లా పరిషత్‌ సమావేశంలో బహిరంగంగానే నిలదీశారు. కరోనా సమయంలో ఆనందయ్య మందు పంపిణీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ అనిల్ సర్వేపల్లి డీఎస్పీని బదిలీ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక సర్వేపల్లి చెరువులో నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ తవ్వారంటూ కాకాణి అనుచరులపై అప్పట్లో కేసులు నమోదు చేయడం ఇద్దరి మధ్య చిచ్చురేపింది.

పెన్నానదిలో ఇసుక అక్రమ రవాణాపై అధిష్ఠానానికి పరస్పరం ఫిర్యాదులూ చేసుకున్నారు. ఇలా గతం నుంచీ కొనసాగుతున్న విభేదాలు.. ఇటీవల మంత్రివర్గ విస్తరణ తర్వాత రసవత్తర మలుపులు తీసుకుంటున్నాయి.

ఇదీ చదవండి:

Last Updated : Apr 15, 2022, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.