హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 85వ వార్షికోత్సవం జరగనుంది. సైన్స్ రంగంలో చేస్తున్న పరిశోధనల గురించి ఈ సదస్సులో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సాంకేతిక ముఖ్య సలహాదారు విజయరాఘవన్, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, పద్మవిభూషణ్ సోనల్ మాన్ సింగ్ ప్రసంగించనున్నారు.
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మరింత చేరువ
పాఠశాల, కళాశాల విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మరింత చేరువ చేసేందుకు ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ కృషి చేస్తోందని హెచ్సీయూ ఉప కులపతి అప్పారావు తెలిపారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధనకు సంబంధించిన జర్నల్స్ అంతర్జాతీయ స్థాయిలో ప్రచురితమయ్యాయని మూడు రోజుల పాటు జరిగే సదస్సును పరిశోధనా రంగ విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు.