ETV Bharat / city

ఏపీలోకి నో ఎంట్రీ... సరిహద్దుల్లో పడిగాపులు

ముందస్తు సమాచారం లోపానికి తోడు... అనుమతులిచ్చి ఇప్పుడు చెల్లవు అంటున్న అధికారుల తీరు కారణంగా.. రాష్ట్ర సరిహద్దుల్లో ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. లాక్​డౌన్​తో ఆయా రాష్ట్రాల్లో పనులు లేక ఊళ్లకు తిరిగివస్తున్న వారు కొందరు, కోచింగ్, ఉద్యోగాల కోసం వెళ్లినవారు మరి కొందరు స్వస్థలాలకు తిరిగి వచ్చేందుకు సరిహద్దుల వద్దకు భారీగా చేరుతున్నారు. కరోనా వ్యాప్తి నివారించేందుకు సరిహద్దులు మూసివేశారని, ఎవరినీ ఏపీలోకి అనుమతించబోమని పోలీసులు అంటున్నారు. ఫలితంగా.. ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

BORDER
ఏపీలోకి నో ఎంట్రీ... సరిహద్దుల్లో పడిగాపులు
author img

By

Published : Mar 26, 2020, 8:58 PM IST

కృష్ణా జిల్లా తిరువూరులో.. ఏపీ, తెలంగాణ సరిహద్దుకు భారీగా వాహనాలు చేరుకుంటున్నాయి. లాక్​డౌన్ కారణంగా తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తున్న వాహనాలను ఆంధ్రా పోలీసులు రాష్ట్రంలోకి అనుమతించటం లేదు. గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వాహనాలు నిలిపివేయటం వల్ల వాహనదారులు తిరువూరు వైపు వస్తున్నారు. ఈ కారణంగా తిరువూరు చెక్​పోస్ట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో వాహనదారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

కరోనా వ్యాప్తిని నివారించేందుకు కృషి చేస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు చెక్​పోస్టులను మూసివేశామని తెలిపారు. తెలంగాణ నుంచి వెళ్లిన వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి చెక్​ పోస్ట్ వద్దకు తెలంగాణ నుంచి భారీగా వాహనాలు వెళ్తున్నాయి. రాష్ట్రంలోకి మాత్రం అనుమతించబోమని ఏపీ పోలీసులు కచ్చితంగా చెబుతున్నారు. వచ్చిన వాహనాలను తిప్పి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో...

అనంతపురం జిల్లాలోని ఏపీ - కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో... లాక్​డౌన్ దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. గత రెండు రోజులుగా కర్ణాటక నుంచి వచ్చే వాహనాలను ఏపీలోకి అనుమతించటం లేదు. మంగళవారం బెంగళూరు నుంచి పెద్దఎత్తున సొంత గ్రామాలకు వచ్చేందుకు యత్నించిన వారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. వాహనాలపై వస్తున్న వారిని పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. ఈ విషయంపై కర్ణాటక పోలీసులకూ సమాచారం ఇచ్చారు. అక్కడ 44వ నంబరు జాతీయ రహదారిపైకి ఎవరినీ అనుమతించకుండా చర్యలు తీసుకున్నారు. కర్ణాటక నుంచి వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని, అనుమతిస్తే వారిని క్వారంటైన్​లో ఉంచుతామని హెచ్చరిస్తుండటం వల్ల చాలామంది వెనక్కి వెళ్లిపోయారు. బుధ, గురువారాల్లో పోలీసులు తీసుకున్న చర్యలతో బెంగళూరు నుంచి ఎవరూ అనంతపురం జిల్లాలోకి రావటంలేదు. కొడికొండ చెక్ పోస్టు వద్ద 44వ నంబరు జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది.

కూలీల పాట్లు

బెంగళూరు నుంచి స్వగ్రామాలకు వెళ్తున్న 104 మందిని ప్రకాశం జిల్లా మెదరమెట్లలో పోలీసులు నిలిపివేశారు. బెంగళూరులో కూలి పనుల నిమిత్తం వెళ్లారు. కరోనా ప్రాథమిక పరీక్షలు చేసిన అనంతరం వారిని ఇళ్లకు పంపేందుకు సన్నాహాలు చేపట్టారు.

ఏపీలోకి నో ఎంట్రీ... సరిహద్దుల్లో పడిగాపులు

ఇవీచూడండి: కరోనాపై సీఎం కేసీఆర్​ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.