ETV Bharat / city

కరోనా సాకుతో వినియోగదారులపై ధరాభారం

author img

By

Published : Mar 30, 2021, 11:35 AM IST

కరోనా సాకు చూపి నిత్యావసర వస్తువుల కొరత సృష్టించి ధరలను అమాంతం పెంచేస్తున్నారు. కొవిడ్‌ రెండోదశలో కేసులు పెరగడం, విద్యాసంస్థల మూసివేతతో.. మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తారనే వార్తలతో నిత్యావసరాలను కొనేందుకు జనం ఎగబడుతున్నారు. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు... ధరలు పెంచి వినియోగదారులను నిలువు దోపిడి చేస్తున్నారు.

corona effect on commodities, commodities
నిత్యావసరాలపై కరోనా భారం, ధరాభారం

కరోనా సాకుతో వినియోగదారులపై ధరాభారం

రోజువారీ కొవిడ్‌ కేసులు పెరగడం, విద్యాసంస్థల మూసివేత, మహారాష్ట్రలో కర్ఫ్యూ విధింపు పరిణామాలు రాష్ట్రంలో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చేలా చేస్తున్నాయి. లాక్‌డౌన్ విధిస్తారన్న ఊహగానాలతో ముందుగానే నిత్యావసర వస్తువులు కొనుగోలుకు హైదరాబాద్ వాసులు మార్కెట్ల వద్ద బారులు తీరుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పాక్షిక లాక్‌డౌన్ కొనసాగుతుండడం...రానున్న రోజుల్లో మన రాష్ట్రంలోనూ ఆంక్షలు అమలవుతాయని భావిస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుతాయనే భావనతో ముందుగానే మూడు నెలలకు సరిపడా సరుకు తెచ్చి ఇంట్లో దాచుకుంటున్నారు.

మార్కెట్‌లో బియ్యం, పప్పులు, వంట నూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. కొవిడ్‌ను సాకుగా చూపి వ్యాపారులు ఇష్టారాజ్యంగా దగా చేస్తున్నారని వినియోదారులు వాపోతున్నారు. మహమ్మారితో ఉపాధి కోల్పోయి కష్టాల్లో ఉన్న తమకు ధరాభారం గుడిబండలా మారిందని ఆవేదన వ‌్యక్తం చేస్తున్నారు.

టోకు మార్కెట్‌లో బియ్యం కిలో 40 నుంచి 45 రూపాయలు ఉంటే... చిల్లర మార్కెట్‌లో 10 రూపాయలు పెంచి విక్రయిస్తున్నారు. కందిపప్పు, మినుములు, పెసర పప్పులోపాటు సుగంధ ద్రవ్యాలు, ఇతర నిత్యావసరాల ధరలూ 20 రూపాయలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎండు మిరప, వంటనూనె ధరలు మండిపోతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావమే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

ఉగాది తదితర పండుగలు వస్తున్న వేళ సరుకుల ధరలు మరింత పెరుగుతాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.