High temperatures: రాష్ట్రంలో వేసవి తాపం మొదలైంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో నేటి నుంచి రాగల ఐదు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే విధంగా రాగల మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్ర సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి.. ఈరోజు విదర్భ నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సగటు సముద్ర మట్టం నుంచి సుమారు 0.9కిమీ ఎత్తు వరకు కొనసాగుతుందని సంచాలకులు వివరించారు.
ఇదీ చూడండి: నేత్రపర్వంగా మహాకుంభ సంప్రోక్షణ.. స్వయంభువునికి కేసీఆర్ తొలిపూజ..