హాస్యనటుడు వేణుమాధవ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో వైద్యులు కృతిమ శ్వాస అందిస్తున్నారు. ఈ నెల 6న కాలేయ సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరిన వేణుమాధవ్‌కు వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడం వల్ల రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. వేణుమాధవ్ ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జీవిత రాజశేఖర్, నటుడు ఉత్తేజ్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని వేణుమాధవ్ ఆరోగ్యపరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జన్మించిన వేణుమాధవ్ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా, కథానాయకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సంప్రదాయం చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టిన వేణుమాధవ్‌కు... తొలిప్రేమ, దిల్, లక్ష్మి, సై, ఛత్రపతి చిత్రాలు మంచిపేరు తీసుకొచ్చాయి. 2006లో లక్ష్మి సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా వేణుమాధవ్ నంది పురస్కారాన్ని అందుకున్నారు
ఇదీ చూడండి : ఆత్మహత్య చేసుకోమని మహిళకు తోటి ఉద్యోగుల వేధింపులు