ఒంటిపై రంగులతో చూడముచ్చటగా ఉన్న ఈ రొయ్య విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపలకంచేరులో చిక్కింది. సోమవారం వేటకు వెళ్ళిన మత్స్యకారుడు ఎర్రోడు తాత వలకు ఈ రంగు రొయ్య చిక్కింది. సుమారు రెండు కిలోలు ఉన్న దీని ధర బయట మార్కెట్లో రూ.మూడు వేలకు పైగా ఉంటుందని చెబుతున్నారు.
దీనిపై మత్స్య శాఖ ఏడి సుమలత మాట్లాడుతూ సముద్రపు అడుగు భాగంలో రాళ్ల మధ్య ఎక్కువగా ఉండే వీటిని రాతి రొయ్యలు అంటారని తెలిపారు. అలల తాకిడితో అరుదుగా బయటకు వస్తాయని వివరించారు.
ఇదీ చదవండి: ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాలో జాప్యం