హైదరాబాద్‌లోని టోలిచౌకిలోని వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ శ్వేతా మహంతి పరిశీలించారు. కలెక్టర్‌తో పాటు డీఎస్పీ శ్రీనివాస్, ఎమ్మెల్యే కౌసర్ మోయినుద్దీన్ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.
బస్తీల్లోని ప్రజలతో మాట్లాడి సమస్యలను కలెక్టర్ తెలుసుకున్నారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.