ఏపీలోని తిరుపతిలో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదు కావడంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వ్యక్తికి ప్రాథమిక కాంటాక్టులుగా గుర్తించిన 16 మంది నుంచి నమూనాలను సేకరించారు. వాటిని హైదరాబాద్(hyderabad)లోని సీసీఎంబీకి శనివారం పంపారు. ఒకరి నుంచి రెండు నమూనాలను సేకరించి ఒకటి స్విమ్స్, మరొకటి సీసీఎంబీకి పంపారు.
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి శ్రీహరి ఆ ప్రాంతంలో పర్యటించి ఫీవర్ సర్వేపై పలు సూచనలు చేశారు. డెల్టా ప్లస్ వేరియంట్ సోకిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. వేరియంట్ వేగంగా విస్తరించే గుణం ఉన్నప్పటికీ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : Permits Postponed: రాయలసీమ ఎత్తిపోతల పర్యావరణ అనుమతులు వాయిదా