రాష్ట్రంలో చలిపెరుగుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా కొహీర్‌లో అత్యల్పంగా 13.2, ఆదిలాబాద్‌లో 15.8, హైదరాబాద్‌లో 17.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇవే ఇప్పటివరకూ అత్యల్ప ఉష్ణోగ్రతలు. తెలంగాణలో మంగళ,బుధవారాల్లో పగలు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.
- ఇదీ చూడండి : వరద ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం