భాగ్యనగరంలో చలి వణికిస్తోంది. బుధవారం తెల్లవారుజామున బీహెచ్‌ఈఎల్‌లో 10, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో 10.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారంతో పోలిస్తే ఈ ప్రాంతాల్లో మరింతగా తగ్గాయి. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న పొడి గాలులతో చలి తీవ్రత పెరుగుతోంది. శీతల గాలుల వేగం ఎక్కువ ఉన్నచోటనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు పతనం అవుతున్నాయి.
అత్తాపూర్‌లో అత్యధిక గాలుల వేగం గంటకు 15.1 కి.మీ., కార్వాన్ 14.4 కి.మీ.గా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి సొసైటీలో నమోదైంది. సాధారణంగా గాలుల వేగం గంటకు 10 కి.మీ.కంటే తక్కువగా ఉంటుంది. కానీ పరిస్థితి భిన్నంగా ఉంది.