ETV Bharat / city

ఏపీ తూర్పు బరిలో ఈసారీ 'పుంజే' గెలిచింది..! - cock fights in east godavari

కత్తుల స్వాధీనం.. బైండోవర్‌ కేసులు.. బరుల ధ్వంసం.. నోటీసుల జారీ.. ఇలా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కోడిపందేల నియంత్రణకు యంత్రాంగం ఎన్ని ముందస్తు చర్యలు చేపట్టినా.. అవన్నీ తుస్‌మన్నాయి. ప్రతిఏడు మాదిరి అనధికారిక అనుమతులతో యథేచ్ఛగా సాగాయి. సంప్రదాయం మాటున కోట్లలో చేతులు మారాయి.

cock-fights-in-kakinada
ఏపీ తూర్పు బరిలో ఈసారీ 'కోడే' గెలిచింది
author img

By

Published : Jan 15, 2021, 11:08 AM IST

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌, 30 పోలీసు యాక్ట్‌ అమల్లో ఉంది. కొద్దిరోజులుగా పోలీసులు నిఘా వేశారు. కోడి పందేలు, పేకాట, గుండాట, అశ్లీల నృత్యాలు ఎవరు నిర్వహించినా చర్యలు తప్పవని పదేపదే హెచ్చరించారు. సిద్ధంచేసిన బరులను ధ్వంసం చేశారు. కానీ జిల్లాలో ఆ హెచ్చరికలను నిర్వాహకులు ఎవరూ లెక్క చేయలేదు. భోగి రోజున ప్రతిఏడు మాదిరి ఈ ఏటా బరులు సిద్ధమయ్యాయి. కోళ్లు కత్తులు కట్టుకుని కయ్యానికి కాలు దువ్వాయి. ఈ ప్రాంగణాల్లో పేకాట, గుండాట శిబిరాలు వెలిశాయి. వీరిని ఉత్సాహపరిచేలా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఊపందుకున్నాయి. పోలీసుల చర్యలు నెమ్మదించడంతో నిర్వాహకులదే పైచేయి అయింది. ఈ తంతు సంక్రాంతి, కనుమ, ముక్కనుమ వరకు సాగనుంది. సంప్రదాయం ముసుగులో రాజకీయుల అభయంతో వ్యవహారం దర్జాగా సాగుతోంది.

500 బరుల్లో.. కో'ఢీ'..

జిల్లాలో 500 బరులు ఏర్పాటైనట్లు సమాచారం. కరోనా సంక్షోభం వేధించినా.. తాజా పరిస్థితి చూస్తే.. రూ.కోట్లలోనే జూదం సాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బరులు వెలిశాయిలా..

మూడో డివిజన్‌ పరిధిలోని గొడారి గుంట ● కాకినాడ గ్రామీణం: వలసపాకల, వాకలపూడి, పండూరు, నేమాం, గైగోలుపాడు, తూరంగి, కొవ్వాడ. ● పి.గన్నవరం: ఉడిమూడి, మానేపల్లి, చాకలిపాలెం. ● అంబాజీపేట: గంగకుర్రు అగ్రహారం, మాచవరం, నందంపూడి. ● అయినవిల్లి: తొత్తరమూడి, చిరుపల్లి. ● అమలాపురం: వన్నెచింతలపూడి, కొంకాపల్లి, ఇందుపల్లి. ● తాళ్లరేవు: సుంకరపాలెం, సీతారామపురం, జి.వేమవరం. ● మామిడికుదురు: మగటపల్లి, ఆదుర్రు, అప్పన్నపల్లి, లూటుకుర్రు. ● కొత్తపేట ● రావులపాలెం: రావులపాడు. ● ఆత్రేయపురం: ర్యాలీలో మూడు శిబిరాలు, లొల్ల, తాడిపూడి ఒక్కొక్క శిబిరం ● ముమ్మిడివరం: పల్లెపాలెం, రాజుపాలెం, కొత్తలంక, అన్నంపల్లి, ఠాణేలంక ● కరప: వేములవాడ, నడకుదురు, పెనుగుదురు, గొర్రిపూడి, గురజాపల్లి ● గొల్లప్రోలు: చేబ్రోలు, దుర్గాడ, తాటిపర్తి, మల్లవరం, చెందుర్తి, ఎ.విజయనగరం ● పిఠాపురం: వైఎస్సార్‌ గార్డెన్స్‌ ప్రాంతం.. కొత్తపల్లి, చిత్రాడ, విరవాడ ● సామర్లకోట: వేట్లపాలెం, మేడపాడులో కోడి పందేలు జోరుగా సాగాయి.

చూసీ.. చూడనట్లు..

జిల్లాలో అన్నిచోట్లా జూదం జాడలు కనిపిస్తున్నాయి. రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. సంప్రదాయాలకు అడ్డుచెప్పొద్దనీ, న్యాయస్థానం ఆదేశాలు ఉన్నా స్థానికంగా సహకరించాలని కొందరు నాయకులు హుకుం జారీచేశారు. నాయకుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో స్థానిక పోలీసులు బరుల వైపు కన్నెత్తి చూడడం లేదు.

ఎట్టెట్టా...

●రామచంద్రపురం పట్టణంలో తొలిసారిగా కాకినాడరోడ్డులో కోడి పందేలు నిర్వహించారు. ముందురోజు ముగ్గుల పోటీలు నిర్వహించిన ప్రాంగణమే బరిగా మారడం గమనార్హం. వెల్లరోడ్డులోనూ జరిగాయి.

●కాకినాడ గ్రామీణం: తిమ్మాపురం, సర్పవరం బరుల్లో రూ.కోట్లలో వ్యవహారం సాగింది.

● అల్లవరం: గుండిపూడి, రెల్లుగడ్డ, అల్లవరం, కొమరగిరిపట్నం, గోడి గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల సమక్షంలో ఉత్సాహంగా పందేలు సాగాయి.

●రాజోలు: సోంపల్లి, రాజోలు, కడలి, వేగివారిపాలెం, బి.సావరం, తాటిపాక, పొదలాడ, కాట్రేనిపాడులో కోడిపందేలు, పేకాట, గుండాట శిబిరాలు సాగాయి. బరుల వద్ద నిర్వాహకులు భోజనాలు ఏర్పాటుచేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.