ETV Bharat / city

కృత్రిమ పడకల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు : కేసీఆర్

author img

By

Published : Jul 17, 2020, 5:33 PM IST

ప్రైవేట్ ఆసుపత్రులు పడకల కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్​ హెచ్చరించారు. పడకల వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వెల్లడించాలని స్పష్టం చేశారు. పీజీ పూర్తి చేసిన 1200 మంది వైద్యులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 200 వైద్యుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు.

'కృత్రిమ పడకల కొరత సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తాం'

వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్​ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్​తో పాటు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కరోనా చికిత్సలో ఉపయోగించే రెయ్ డిస్ట్రిర్, టోసిలిజుమాబ్ ఇంజక్షన్లు, ఫావిపిరావిర్ టాబ్లెట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొరత రానివ్వవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వాటిని పెద్ద మెత్తంలో సిద్ధంగా పెట్టుకొని, కావాల్సిన వారికి ఉచితంగానే అందించాలని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు పడకల కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్​ హెచ్చరించారు. పడకల వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వెల్లడించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

10శాతం అదనపు వేతనం..

కరోనా వ్యాప్తి నివారణ చర్యల కోసం బడ్జెట్‌కు అదనంగా రూ.100 కోట్లు కేటాయించినట్లు కేసీఆర్‌ చెప్పారు. ఆయుష్‌ విభాగాల్లో పని చేస్తున్న అధ్యాపకుల పదవీవిరమణ వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతోపాటు, వైద్యారోగ్యశాఖ పరిధిలో పని చేస్తున్న వారిలో ఏ ఒక్కరినీ మినహాయించకుండా ప్రతి ఒక్కరికీ 10శాతం అదనపు వేతనం ఇవ్వాలని ఆదేశించారు. పోలీసుశాఖ సిబ్బంది, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి ప్రోత్సాహకాలను కొనసాగించాలని నిర్ణయించారు.

1200 మందిని సర్వీసులోకి..

రాష్ట్రంలో పీజీ పూర్తి చేసిన 1200 మంది వైద్యులను సర్వీసులోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.