ETV Bharat / city

'తెలంగాణ ప్రాజెక్టుల జోలికి రాకుండా దీటుగా సమాధానాలు'

తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలపై అత్యున్నత మండలి రేపు సమావేశం కానుంది. రాష్ట్ర వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకునేందుకు దేవునితోనైనా కొట్లాడేందుకు సిద్ధమన్న ముఖ్యమంత్రి కేసీఆర్... నదీజలాలకు సంబంధించి రేపటి భేటీలో ఆంధ్రప్రదేశ్ వాదనలకు దీటైన సమాధానం ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని కూడా ఎండగట్టాలని నిర్ణయించారు.

author img

By

Published : Oct 5, 2020, 9:39 PM IST

cm kcr
cm kcr

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం నదీజలాల అంశంపై ఏర్పాటైన అత్యున్నత మండలి రెండో సమావేశం మంగళవారం జరగనుంది. అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో 2016 సెప్టెంబర్ 21న జరిగిన మొదటి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. తాజాగా రెండో సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో దృశ్యమాధ్యమ విధానంలో జరగనున్న సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు ఏపీ సీఎం జగన్​మోహన్ రెడ్డి పాల్గొంటారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లు కూడా దృశ్యమాధ్యమం ద్వారా సమావేశానికి హాజరవుతారు.

ఏపీ వాదనలకు దీటుగా

కృష్ణా - గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి, ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇవ్వడం, గోదావరి జలాల్లో వాటా, కృష్ణా బోర్డు తరలింపు అంశాలు అపెక్స్ కౌన్సిల్ సమావేశ ఎజెండాలో ఉన్నాయి. వీటితో పాటు ఇతర అంశాలు కూడా చర్చకు రానున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నాయి. దానికి సంబంధిత అంశాలు కూడా ప్రస్తావనకు రానున్నాయి. అత్యున్నత మండలి సమావేశం నేపథ్యంలో ఇప్పటికే ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్... నదీజలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ వాదనలకు దీటుగా సమాధానం చెప్పాలని, మరోమారు తెలంగాణ ప్రాజెక్టుల జోలికి రాకుండా వాస్తవాలను స్పష్టం చేయాలని నిర్ణయించారు.

కేంద్రాన్ని ఎండగట్టుదాం

నదీజలాల విషయంలో కేంద్రం చేస్తున్న తాత్సారాన్ని కూడా ప్రశ్నించాలని, నిష్క్రియాపరత్వాన్ని ఎండగట్టాలని అన్నారు. అపెక్స్ కౌన్సిల్ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్​కు లేఖ రాసిన ముఖ్యమంత్రి కేసీఆర్... తాను లేవనెత్తిన అంశాలను సమావేశ ఎజెండాలో చేర్చాలని కోరారు. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు గడుస్తున్నా తెలంగాణకు నీటి కేటాయింపులు చేయకపోవడం, అక్రమమైన పోతిరెడ్డిపాడు విస్తరణ-రాయలసీమ ఎత్తిపోతల వల్ల తెలంగాణకు నష్టం, కృష్ణానదీ యాజమాన్య బోర్డు అసమర్థ పర్యవేక్షణ, బోర్డుల పరిధి, గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు, గోదావరి జలాల వినియోగం తదితర అంశాలను సీఎం ప్రతిపాదించారు.

విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి తక్షణమే నీటికేటాయింపులు చేయాలని... పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను ఆపేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంగళవారం నాటి సమావేశంలో కోరనున్నారు.

ఇదీ చదవండి : రైతన్నను కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాటకు సిద్ధం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.