ETV Bharat / city

కరోనా సెకండ్​ వేవ్​ వచ్చినా ఎదుర్కొంటాం: కేసీఆర్​

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో అప్రమత్తంగా ఉండి.. అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశించారు. రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరగకుండా... సెకండ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక మొదటగా ఆరోగ్య సిబ్బందికే ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

cm kcr
cm kcr
author img

By

Published : Nov 22, 2020, 4:25 PM IST

రాష్ట్రంలో మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయని... కొవిడ్ కేసుల సంఖ్య బాగా తగ్గిందని సీఎం కేసీఆర్ అన్నారు. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పదిశాతంలోపే ఉందని.. రికవరీ రేటు 94.5 శాతం ఉందని పేర్కొన్నారు. కరోనా వచ్చిన వారు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ, మరణాల రేటు చాలా తక్కువగా ఉందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని... అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రగతి భవన్​లో కేసీఆర్​ సమీక్ష నిర్వహించారు. సీఎస్​ సోమేశ్ కుమార్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముర్తజా రిజ్వీ ఇతర ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.

సెకండ్​ వేవ్​ వచ్చినా..

రాష్ట్ర వ్యాప్తంగా పదివేల బెడ్స్ ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయని.. ఇంకా ఎన్నయినా సిద్ధం చేయగలమని ప్రస్తుతం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని కేసీఆర్​ పేర్కొన్నారు. దిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, పశ్చిమ్​ బంగ రాష్ట్రాల్లో కేసులు బాగా పెరుగుతున్నాయని సీఎం అన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కొద్దిగా పెరుగుతున్నాయని దీంతో పాటు కొవిడ్ సెకండ్ వేవ్ వచ్చే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. సెకండ్ వేవ్ వచ్చినా సరే తట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉండాలని.. దానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కేసీఆర్​ ఆదేశించారు.

వ్యాక్సిన్ ముందు వాళ్లకే

కొవిడ్ వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం చేయాల్సినంత ప్రయత్నం చేస్తుందని... దీనికి ప్రజల సహకారం కూడా అవసరమన్నారు. అన్ లాక్ ప్రక్రియ నడుస్తున్నప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండడమే అసలైన మందని... తప్పకుండా మాస్క్ ధరించి తగిన జాగ్రత్తలు పాటించాలని వివరించారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక మొదటగా ఆరోగ్య సిబ్బందికే ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.

ఇదీ చదవండి : ప్రపంచంలోనే సురక్షితమైన నగరం హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.