ETV Bharat / city

మంజీరా నదిలోకి కాళేశ్వర గంగ... పంటపొలాలు మురిసిపడంగా... - అవుసులోనిపల్లి

మండుటెండల్లో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మరో అపూర్వ ఘట్టానికి గజ్వేల్ నియోజకవర్గం వేదికైంది. నిండు వేసవిలో గోదావరి జలాలు మంజీరా నదిలోకి పరుగులు పెట్టాయి. అవుసులోనిపల్లి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్​ నీటిని విడుదల చేయగా.. హల్దీవాగులోకి కాళేశ్వర గంగ గలగలా పారింది. సిద్దిపేట, మెదక్ జిల్లాల పరిధిలో చెరువులు జలకళ సంతరించుకోనున్నాయి.. తక్షణం 14వేల ఎకరాలకు పైగా సాగు నీరు అందనుంది.

cm kcr releases kaleshwaram water in to manjeera river
మంజీరా నదిలోకి కాళేశ్వర గంగ... పంటపొలాలు మురిసిపడంగా...
author img

By

Published : Apr 6, 2021, 6:36 PM IST

మంజీరా నదిలోకి కాళేశ్వర గంగ... పంటపొలాలు మురిసిపడంగా...

నిండు వేసవిలో వాగులు చెరువులు అలుగు పారించి.. ఎండిపోతున్న పంటలను కాపాడాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు వదిలారు. మొదట సిద్దిపేట జిల్లా వర్గల్ అవుసులోనిపల్లి వద్ద గోదారమ్మకు సీఎం కేసీఆర్​, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి విజయ సంకేతం చూపించారు. కాళేశ్వరం జలాలు మంజీరాలోకి పరుగులు పెట్టడం పట్ల హర్షం వ్యక్తంచేశారు.

14 వేల ఎకరాలకు నీళ్లు...

ఇక్కడి నుంచి రోజూ 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. 8 నుంచి పది రోజుల్లో గోదావరి జలాలు హల్దీ వాగు, మంజీర నది గుండా నిజాం సాగర్ చేరుకోనున్నాయి. దీని వల్ల తక్షణం 14 వేల ఎకరాల పంటకు మేలు జరగనుంది. హల్దీ వాగులో నిర్మించిన 32చెక్ డ్యాంలు నిండుకుండల్లా మారనున్నాయి. ఈ చెక్ డ్యాంలలో 0.62టీఎంసీల నీరు నిల్వ ఉండనున్నాయి. నిజాం సాగర్ కు సైతం 4 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. ఈ నీళ్లు అవుసులోపల్లి నుంచి మొదట వర్గల్‌లోని బంధం చెరువుకు... అక్కడి నుంచి అదే గ్రామంలోని పెద్దచెరువు.. శాఖారంలోని ధర్మాయ చెరువు.. అనంతరం అంబర్​పేటలోని ఖాన్ చెరువు వరకు గొలుసుకట్టు ద్వారా చేరుకుంటాయి. ఖాన్ చెరువు నుంచి హల్దీ వాగులోకి.... అందులో నుంచి మంజీర నదిలోకి... అక్కడి నుంచి నిజాంసాగర్‌కు కాళేశ్వరం జలాలు చేరుతాయి.

ఇది తాత్కాలికమే...

కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు ప్రస్తుతం సంగారెడ్డి కాల్వ నుంచి నిజాంసాగర్‌కు విడుదల చేసినా ఇది తాత్కాలికమే. కాళేశ్వరం పథకంలో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్ పనులు పూర్తికావడానికి మరో రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉండటంతో.. ప్రత్యామ్నాయంగా కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీవాగు.. తద్వారా నిజాంసాగర్‌కు నీరు తరలిస్తున్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు 5 ఓటీ స్లూయిస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒకటి సింగూరు ప్రాజెక్టుకు వెళ్లే కాల్వ.. ఈ తూము వద్ద 4 గేట్లు ఉంటాయి. ఇక్కడి నుంచి సింగూరు ప్రాజెక్టుకు నీటిని పంపిస్తారు. ఈ కాల్వ కెపాసిటీ 6 వేల కూసెక్కులు ఉంటుంది. ఇదే కాల్వ నుంచి హల్దీ వాగుకు నీటిని విడుదల చేస్తారు.

వానలు రాకపోయినా...

అనంతరం మర్కుక్ మండలంలోని పాములపర్తి వద్ద గజ్వేల్ కాలువలోకి ముఖ్యమంత్రి కేసీఆర్​ నీటిని విడుదల చేశారు. గజ్వేల్ కాలువ ద్వారా మర్కుక్, గజ్వేల్ మండలాల్లోని 20 చెరువులు జలకళను సంతరించుకోనున్నాయి. ప్రస్తుతం నిజాంసాగర్ లో 7.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. యాసంగి పంటలకు మరో తడి ఇవ్వడానికి 1.2 టీఎంసీలు విడుదల చేయనున్నారు. హల్దీవాగు ద్వారా మరో 4 టీఎంసీల నీటిని అందించనున్నారు. నిజాంసాగర్‌లో మొత్తం నీటి నిలువ 10 టీఎంసీలకు చేరనుంది. వచ్చే వర్షకాలంలో వానలు సకాలంలో రాకపోయినా.. ఈ నీటితో పంటలు సాగు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చూడండి: కొండపోచమ్మ జలాశయం నుంచి గోదావరి పరుగులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.