రాయలసీమను రతనాలసీమ చేసేందుకు సహకరిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాయలసీమకు గోదావరి జలాలు రావాల్సి ఉందని అన్నారు. గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని పేర్కొన్నారు. వృథాగా పోయే నీటిని వాడుకుంటే బంగారు పంటలు పండుతాయని వెల్లడించారు. ఏపీకి యువ నాయకుడు, పట్టుదలతో పనిచేసే సీఎం ఉన్నారని... అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరం సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కాంచీపురం అత్తివరదరాజ స్వామికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు