ఎనిమిదో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా.. తెలంగాణ అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నివాళి అర్పించారు. హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద.. పుష్పగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. అనంతరం ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. సచివాలయ కార్యకలాపాలు సాగుతున్న బీఆర్కే భవన్లో సీఎస్ (Chief Secretary) సోమేశ్‌కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమప్రాధాన్యంతో.. బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా దూసుకెళ్తోందని... రాష్ట్ర ఆవిర్భావదిన సందేశంలో సీఎం కేసీఆర్ తెలిపారు. అన్ని వర్గాలకోసం అవసరమైన కార్యక్రమాలు, వినూత్న విధానాలతో చిరుప్రాయంలోనే ఘనవిజయాలతో తనదైన ముద్ర వేసిన తెలంగాణ... చాలా రంగాలు, అంశాల్లో దేశానికి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినట్లు వెల్లడించారు. సంక్షేమం, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ తదితర రంగాల్లో ప్రభుత్వ చర్యలు గుణాత్మక మార్పుకు దోహదపడ్డాయని... అద్భుత ఫలితాలను ఇస్తున్నాయన్నారు. పారిశ్రామికరంగంలోనూ దూసుకెళ్తూ ఐటీలో అద్భుత పురోగతి సాధిస్తోందని తెలిపారు.
ఇవీచూడండి: Telangana: ఏడేళ్లలో తెలంగాణ మాగాణమైంది!