ETV Bharat / city

KCR Meets Amit Shah News: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ భేటీ - cm kcr latest news

CM KCR met Union Home Minister Amit Shah
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం కేసీఆర్
author img

By

Published : Sep 27, 2021, 4:16 PM IST

Updated : Sep 27, 2021, 4:54 PM IST

16:15 September 27

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం కేసీఆర్

  • Hon'ble CM Sri K. Chandrashekar Rao met Hon'ble Union Minister for Commerce & Industry, Consumer Affairs & Food & Public Distribution and Textiles Sri @PiyushGoyal Ji in New Delhi today. pic.twitter.com/wZfvrKp7np

    — Telangana CMO (@TelanganaCMO) September 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీఎం కేసీఆర్​ దిల్లీ (KCR TOUR IN DELHI) పర్యటనలో భాగంగా...  కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ( union minister amit shah) సీఎం కేసీఆర్ (CM KCR) మరోసారి భేటీ అయ్యారు. అంతకుముందు కేంద్రమంత్రి గోయల్‌తో కేసీఆర్​ సమావేశమయ్యారు.  

ఆదివారం దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో జరిగిన మావోయిస్టుల ప్రభావిత ప్రాంత రాష్ట్రాల సదస్సులో సీఎం కేసీఆర్​ పాల్గొన్నారు. మూడు, నాలుగు దశాబ్దాలుగా.. రాష్ట్రం వామపక్ష తీవ్రవాదాన్ని చవిచూసిందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదరిక నిర్మూలన, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏకకాలంలో చేపడుతున్నామని తెలిపారు. యువతతో పాటు, అన్ని వర్గాలకూ... రాష్ట్రప్రభుత్వం చేదోడుగా ఉంటోందని వెల్లడించారు. వ్యవసాయ, సాగునీటి సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. 

అనంతరం కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో (Minister Piyush Goyal)ముఖ్యమంత్రి కేసీఆర్​ సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఆ సమావేశంలో రాష్ట్రంలో భారీగా పేరుకున్న ఉప్పుడు బియ్యాన్ని.... కేంద్ర ప్రభుత్వమే కొనుగోలుచేసే వెసులుబాటు కల్పించాలని ప్రధానంగా విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.

గత దిల్లీ పర్యటనలోనూ ముఖ్యమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి.. ఇదే విషయాన్ని సీఎం విజ్ఞప్తిచేశారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌.... పీయూష్‌ గోయల్‌ను కలిశారు. కేంద్రం కొనుగోలు చేయకపోతే …...రాష్ట్రం ఇబ్బంది పడాల్సి వస్తుందని, అందువల్ల కేంద్రం సాయం చేయాలని తాజా సమావేశంలో ముఖ్యమంత్రి మరోసారి కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇంటికి వెళ్లి ఆయనతో సుమారు గంటన్నర సేపు భేటీ అయ్యారు. ఉప్పుడు బియ్యం సమస్యపై ఆయనకూ విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మరోసారి అమిత్​ షాతో ఇవాళ సీఎం కేసీఆర్​ భేటీ అయ్యారు.

ఇదీ చూడండి: ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయండి: కేంద్రానికి సీఎం విజ్ఞప్తి

Last Updated : Sep 27, 2021, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.