ETV Bharat / city

సాయంత్రం 4 గంటలకు ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ

మూడు రోజుల పర్యటనలో భాగంగా దిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్​... సాయంత్రం 4.30 గంటలకు ప్రధానితో భేటీ కానున్నారు. ముందుగా ఉదయం 11గంటలకు సమావేశం కావాల్సి ఉన్నా.. సాయంత్రానికి వాయిదా పడింది. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ప్రాజెక్టులకు నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన రూ.19 వేల కోట్ల సాయం మంజూరు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చిస్తారు. కేసీఆర్‌ శనివారం వరకు దిల్లీలోనే ఉంటారు. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు.

kcr-modi
author img

By

Published : Oct 4, 2019, 9:20 AM IST

మూడు రోజుల పర్యటనలో భాగంగా దిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్​... సాయంత్రం 4.30 గంటలకు ప్రధానితో భేటీ కానున్నారు. గోదావరి - కృష్ణా నదుల అనుసంధానానికి కేంద్రం తోడ్పాటు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. రిజర్వేషన్ల పెంపు, విభజన చట్టం హామీలు వంటి పెండింగ్ అంశాలు ప్రస్తావించనున్నట్లు సమాచారం.

ప్రధానితో భేటీ తర్వాత శుక్ర, శనివారాల్లో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలాసీతారామన్‌, నితిన్‌గడ్కరీ, పీయూష్‌గోయల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలుస్తారని సమాచారం. హైదరాబాద్‌లో అభివృద్ధి పనులకు రక్షణ శాఖ భూముల కేటాయింపు, తెలంగాణకు కేంద్ర ఆర్థిక సాయం, జాతీయ రహదారుల ప్రతిపాదనలకు ఆమోదం, రైల్వే కోచ్‌ల కర్మాగారం, ఇతర ప్రాజెక్టుల పనులపై కేసీఆర్‌ వారితో చర్చిస్తారు.

ప్రధానితో చర్చించనున్న ప్రధాన అంశాలు

  1. తెలంగాణ, ఏపీ ప్రయోజనాల కోసం ప్రతిపాదించిన కృష్ణా - గోదావరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర సాయం
  2. రాష్ట్రంలోని ఒక నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా.
  3. ఆర్థిక మాంద్యం దృష్ట్యా రాష్ట్రానికి గ్రాంట్లు, కేంద్రం వాటా నిధులు యథాతథంగా ఇవ్వడం
  4. జోనల్‌ విధానంలో కొత్త జిల్లాలకు చోటు
  5. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ
  6. కాజీపేటలో రైల్వే కోచ్‌ల కర్మాగారం
  7. వెనుకబడిన జిల్లాలకు, కేంద్ర సౌజన్య పథకాలకు నిధులు
  8. పంటలకు మద్దతు ధరలు
  9. వ్యవసాయానికి ఉపాధిహామీ అనుసంధానం
  10. ఆహారశుద్ధి పరిశ్రమలకు కేంద్ర సాయం

ఇదీ చూడండి: కొలిక్కిరాని ఆర్టీసీ సమ్మె చర్చలు.. అయోమయంలో ప్రజలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.