ఈ నెల14 నుంచి పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తెరాస దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు.
పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహం సహా.. రాష్ట్రానికి చెందిన పలు అంశాల్లో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, విద్యుత్ సంస్కరణలు, జీఎస్టీ విషయంలో కేంద్రం తీరు, రాష్ట్రం అనుసరించాల్సిన విధానం తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు.
ఇవీ చూడండి: ఎంత మందికి కరోనా సోకినా చికిత్స అందించడానికి సిద్ధం: మంత్రి ఈటల