గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. తమిళిసై చిన్నాన్న వసంత్ కుమార్ నిన్న మరణించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఇవాళ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను పరామర్శించారు.
అటు గవర్నర్ తండ్రి అనంతన్ కూడా స్వల్ప అస్వస్థతకు గురవగా... ఆయన ఆరోగ్య పరిస్థితిని సైతం ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.