ETV Bharat / city

CM KCR Birthday Wishes: జన్మదిన శుభాకాంక్షలతో.. ఒడిశాలో కేసీఆర్​ భారీ సైకత శిల్పం.. - CM KCR birthday

CM KCR Birthday Wishes: రేపు.. సీఎం కేసీఆర్​ జన్మదినం సందర్భంగా నేతలు వివిధ రకాలుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అన్నదానాలు, పండ్ల పంపిణీ, రక్తదానాలతో రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్​ అభిమానాలు పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు. సిద్దిపేటకు చెందిన వంగ రాజేశ్వర్​రెడ్డి మాత్రం కేసీఆర్​కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు.

CM KCR huge sculpture in Odisha with birthday wishes by Vanga Rajeshwar Reddy

author img

By

Published : Feb 16, 2022, 7:40 PM IST

CM KCR Birthday Wishes: సీఎం కేసీఆర్​ పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెరాస నేతలు, అభిమానులు రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. ఆస్పత్రుల్లో అన్నదానాలు, పండ్ల పంపిణీతో పాటు అభిమానులు రక్తదానాలు చేస్తున్నారు. వినూత్న కార్యక్రమాలు చేస్తూ.. కేసీఆర్​పై తమకున్న అభిమానాన్ని నేతలు చాటుకుంటున్నారు. ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కేసీఆర్​ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు.

అదే క్రమంలో.. సిద్దిపేటకు చెందిన వంగ రాజేశ్వర్​రెడ్డి సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు వినూత్నంగా తెలియజేశారు. కేసీఆర్​ జన్మదినం సందర్భంగా పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ బీచ్​లో భారీ సైకత శిల్పాన్ని రూపొందించారు. బీచ్​లోని ఇసుకతో ఆయన చిత్రాన్ని అందంగా తీర్చిదిద్ది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కళాకృతి సందర్శకులను విశిష్టంగా ఆకట్టుకుంటోంది. పోరాట యోధుడు, పరిపాలకుడు, దూరదృష్టి గల నేతకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ.. కేసీఆర్ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. సిద్దిపేటకు చెందిన వంగ రాజేశ్వర్​రెడ్డి సమన్వయంతో సుదర్శన్ పట్నాయక్ దీన్ని రూపొదించారు.

CM KCR huge sculpture in Odisha with birthday wishes by Vanga Rajeshwar Reddy
పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్​తో వంగ రాజేశ్వర్​రెడ్డి..

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.