ETV Bharat / city

దేశ రాజకీయాలపై తెరాస ఫోకస్​.. వ్యవసాయ సమస్యలే అస్త్రంగా దూకుడు.. - cm kcr on power on national politics

జాతీయ రాజకీయాలపై తెరాస దృష్టి(trs party focus on national politics) సారిస్తోంది. వరి కొనుగోళ్లపై స్పష్టతనివ్వాలంటూ కేంద్రం, భాజపాపై దాడి చేస్తున్న కేసీఆర్(cm kcr demand on paddy procurement policy).... రైతు అంశాలతో రోజురోజుకీ దూకుడు పెంచుతున్నారు. సాగు చట్టాల ఉద్యమంలో మరణించిన అన్నదాతలకు... రాష్ట్రం తరఫున 3లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం(CM KCR on Three farm laws)... కేంద్రం 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర చట్టం కోసం పోరాడతామన్న గులాబీ దళపతి.. విద్యుత్ చట్టం రద్దుకు పోరాడతామన్నారు.

Cm kcr focus on national politics based on Agricultural problems

author img

By

Published : Nov 21, 2021, 5:25 AM IST

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని గతంలో పలు సందర్భాల్లో బహిరంగంగా వెల్లడించిన గులాబీ పార్టీ(trs party focus on national politics)... ఒక అడుగు ముందుకు.. మరో అడుగు వెనక్కి అన్నట్లు వ్యవహరిస్తూ వస్తోంది. ప్రస్తుతం.. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సమస్యలే ప్రధాన అజెండాగా తెరాస దూసుకెళ్తోంది. రాష్ట్రంలో వరి కొనుగోళ్ల(paddy procurement in telangana)పై స్పష్టతనివ్వాలంటూ ఆందోళనలు ప్రారంభించిన గులాబీ పార్టీ... జాతీయ స్థాయి రైతాంగం అంశాలన్నింటిపై ఫోకస్ చేస్తూ ఉద్యమాన్ని చేసే దిశగా కదలుతోంది. అవసరమైతే భారత రైతాంగానికి తెరాస నాయకత్వం వహిస్తుందని కేసీఆర్ ఇటీవల స్పష్టంగా ప్రకటించారు. మహాధర్నా మరుసటి రోజునే ప్రధాని నరేంద్రమోదీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం... కేసీఆర్ ఘనతేనంటూ తెరాస శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరిపాయి.

కేసులన్ని ఎత్తివేయాలని డిమాండ్​..

ఈ మేరకు దూకుడు పెంచిన సీఎం... సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మరణించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 3 లక్షల రూపాయల చొప్పున కేసీఆర్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అమరులైన సుమారు 700 మంది రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు 28 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్రం ప్రభుత్వం కూడా ఒక్కో రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాల రద్దు భారత రైతాంగం సాధించిన అద్భుత విజయంగా అభివర్ణించిన గులాబీ పార్టీ అధ్యక్షుడు... ప్రధాని మాటలను దేశవ్యాప్తంగా ఎవరూ నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల స్టంటుగా ప్రచారం జరుగుతోందన్నారు. రైతాంగ ఉద్యమానికి సంబంధించిన కేసులన్నీ ఎత్తివేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలకు తెరాస ఎప్పుడూ మద్దతివ్వలేదని కేసీఆర్ పేర్కొన్నారు.

మద్దతు ధర చట్టంపై..

కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని తెరాస అధ్యక్షుడు కేసీఆర్ డిమాండ్ చేశారు. రైతులు గరిష్ట మద్దతు ధర కోరడం లేదని.. కనీస మద్దతు అడగటంలో న్యాయం ఉందన్నారు. కనీస మద్దతు ధర చట్టం కోసం పోరాటం చేస్తామని.. పార్లమెంటులోనూ డిమాండ్ చేస్తామన్న కేసీఆర్.. కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఆత్మ నిర్భర భారత్ కార్యక్రమంలో మొదట రైతాంగానికి, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమివ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జ్ఞానోదయమై.. సాగు చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం... విద్యుత్ చట్టం బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రాలపై బలవంతంగా నూతన విద్యుత్ చట్టాన్ని రుద్ద వద్దని సీఎం కోరారు. కేంద్రం అవసరమైతే భాజపా పాలిత రాష్ట్రాలతో అమలు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ఉచిత విద్యుత్ ఇచ్చే తెలంగాణ వంటి రాష్ట్రాల్లో మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేయవద్దన్నారు.

బీసీ కుల గణన చేయాల్సిందే...

జనాభా లెక్కలతో పాటు బీసీ కుల గణన చేయాల్సిందేనని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. దేశంలో కుల వ్యవస్థ ఉందని... అలాంటప్పుడు కులాల వారీగా లెక్కలు చెప్పడానికి సిగ్గు పడటమెందుకని కేసీఆర్ ప్రశ్నించారు. పారదర్శక పాలనలో దాపరికాలు ఎందుకన్నారు. రైతాంగ అంశాలపై పోరాటంలో సందర్భాన్ని బట్టి ఎవరెవరిని కలుపుకోవాలో కలుపుకుంటామని కేసీఆర్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.