కరోనా వైరస్ వ్యాప్తి గురించి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసే వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రజల్లో భయాందోళనలు పెంచొద్దని హితవు పలికారు. ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా, ఊర్ల పేర్లు రాసి ప్రజల్లో లేని భయాన్ని సృష్టించవద్దన్నారు.
ఇదీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్