ETV Bharat / bharat

చినాబ్ వంతెనపై చైనా, పాకిస్థాన్​ కన్ను! - CHENAB BRIDGE INDIA

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై కన్నేసిన పాకిస్థాన్, చైనా- కీలక సమాచారం సేకరణ!

Chenab Bridge India
Chenab Bridge India (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2024, 7:01 AM IST

Chenab Bridge India : జమ్మూకశ్మీర్‌లోని చినాబ్‌ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై పాకిస్థాన్, చైనా కన్నేసినట్టు తెలుస్తోంది. కశ్మీర్‌ను మిగిలిన ప్రాంతాలతో కలిపే ఈ వంతెనకు సంబంధించి కీలక సమాచారాన్ని రెండు దేశాలు సేకరించినట్టు సమాచారం. చైనా ఆదేశాలతో పాకిస్థాన్‌ ఈ సమాచారాన్ని సేకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

పాక్ నిఘా వర్గాలు సేకరించినట్టు!
జమ్ముకశ్మీర్‌లోని చినాబ్‌ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై పాకిస్థాన్‌, చైనా కన్నేసినట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయని జాతీయ మీడియా పేర్కొంది. జమ్మూకశ్మీర్‌లోని రియాసీ, రాంబన్ జిల్లాల మధ్య నిర్మించిన ఈ వంతెనకు సంబంధించి కీలక వివరాలు పాకిస్థాన్‌ నిఘా వర్గాలు సేకరించినట్టు తెలుస్తోంది. చైనా ఆదేశాల మేరకే చినాబ్ వంతెనపై పాకిస్థాన్ నిఘా వర్గాలు కన్నేసినట్టు సమాచారం. ఈ వివరాలను చైనా ఎందుకు తెలుసుకుంటుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. దేశానికి సంబంధించి అత్యంత కఠినమైన సరిహద్దు ప్రాంతం ఉన్న జమ్ముకశ్మీర్‌లో చినాబ్ వంతెన వల్ల భారత్‌కు సైనికపరంగా, వ్యూహాత్మకంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా ఈ వంతెనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.

మొత్తం 20ఏళ్లపాటు!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్‌ రైల్వేవంతెన నిర్మాణం పూర్తిచేయడానికి ప్రభుత్వానికి 20 ఏళ్లు పట్టింది. ఇటీవల ఈ వంతెనపై తొలి రైలు ట్రయల్‌ రన్‌ విజయవంతంగా నిర్వహించారు. కశ్మీర్‌ను దేశంలోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఈ నిర్మాణాన్ని ఉధంపుర్‌-శ్రీనగర్‌- బారాముల్లా రైల్వే లింక్‌ -U.S.B.R.L ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్‌ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయ్‌ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఈ వంతెన అధిగమించింది. పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్‌ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉంటుంది. చినాబ్ నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.