MS Dhoni Nicknames : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ భారత క్రికెట్ కు ఎనలేని సేవలు అందించాడు. అతడి కెప్టెన్సీలోనే భారత జట్టు మూడు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకుంది. అలాగే టీమ్ ఇండియాను టెస్ట్ ర్యాంకింగ్స్ లో తొలిసారి అగ్రస్థానంలో నిలబెట్టింది కూడా ధోనీయే. అంతలా భారత క్రికెట్ లో ధోనీ చెరగని ముద్ర వేశాడు. ఐపీఎల్ లోనూ ధోనీ సత్తా చాటాడు. తాను ప్రాతినిధ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ ను ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిపాడు. అయితే మనందరిలాగే స్టార్ క్రికెటర్లకు ముద్దు పేర్లు ఉంటాయి. అలాగే ధోనీని చాలా మంది 'తలా', 'ఎంఎస్', 'మిస్టర్ కూల్' అని పిలుస్తుంటారు. ఆ పేర్లు ధోనీకి ఎలా వచ్చాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మాహీ
ధోనీ పూర్తి పేరు మహేంద్ర సింగ్ ధోనీ. అందుకే అతడిని చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు 'మాహీ' అని పిలిచేవారు.
'MS'
ధోనీకి ఉన్న మరో ముద్దు పేరు 'MS'. టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో అతడి సహచరులు ముద్దుగా ధోనీనీ 'MS' అని పిలిచేవారు. మహేంద్ర సింగ్ ధోనీలోని మొదటి రెండు అక్షరాలను తీసుకుని ఎంఎస్‌గా పిలిచేవారు.
మిస్టర్ కూల్
మైదానంలో ధోనీ ప్రశాంతత, ప్రవర్తనను చూసి ధోనీ అభిమానులు ఆయన్ను 'కెప్టెన్ కూల్' అనే ముద్దుపేరుతో కూడా పిలుస్తారు. ఈ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అయ్యింది.
తల
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీని ఐదుసార్లు ఛాంపియన్‌గా ఎంఎస్ ధోనీ నిలిపాడు. అందుకే ఆయన్ను తమిళ అభిమానులు 'తల' అని ముద్దుగా పిలుస్తుంటారు. తల అంటే తమిళంలో నాయకుడు, బాస్ అని అర్థమట.
ధోనీ కెరీర్
ఎంఎస్ ధోనీ 90 టెస్టుల్లో 4,876 పరుగులు చేశాడు. 350 వన్డేల్లో 10,773 రన్స్, 98 టీ20ల్లో 1,617 పరుగులు బాదాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 16 సెంచరీలు చేశాడు. 2004లో బంగ్లాపై డెబ్యూ మ్యాచ్ ఆడిన ధోనీ, 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. తాజాగా చెన్నై ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా రిటైన్ చేసుకుంది.
'లేట్‌గా లేవడం, కుక్కలతో ఆడటం!' - ధోనీ డైలీ రొటీన్ ప్లాన్ ఏంటో తెలుసా?
హాలీవుడ్ రేంజ్లో ధోనీ కొత్త లుక్ - ఏముంది రా బాబు ఆ హెయిర్ స్టైల్!