ETV Bharat / spiritual

ఆ రాశి వారు కొత్త పనులు స్టార్ట్ చేయడానికి వేళాయే! ఆదాయం కూడా ఫుల్​గా! - DAILY HOROSCOPE IN TELUGU

నవంబర్ ​2వ తేదీ (శనివారం) రాశిఫలాలు - ఎలా ఉన్నాయంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2024, 5:01 AM IST

Horoscope Today 31st November 2024 : నవంబర్ ​2వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుతో, శక్తిసామర్ధ్యాలతో అందరినీ ఆకర్షిస్తారు. శుభ సమయం నడుస్తోంది. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకొని కొత్త పనులు మొదలు పెడితే దిగ్విజయంగా పూర్తవుతాయి. మీ ప్రతిభతో ఈ రోజు అనేక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం సరిగా లేనందున ఈ రోజంతా ఘర్షణలు, వాదనలు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తిపరంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోడానికి, హక్కులు సాధించుకోడానికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఘర్షణలు తప్పనిసరైన పరిస్థితుల్లో సహనంతో ఉంటూ రాజీ ధోరణి అవలంబిస్తే మంచిది. ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూసుకోండి. ఆర్ధిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో పోటీ పెరగవచ్చు. లాభాల కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా మిమ్మల్ని అర్ధం చేసుకునేవారితో ఎక్కువగా గడపడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. కుటుంబంతో సంతోషంగా, ఆహ్లదకరంగా గడుపుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాలవారికి ఈ రోజు వృత్తిజీవితం కీలక ఘట్టానికి చేరుతుంది. బదిలీ, ప్రమోషన్, జీతం పెంపు వంటి శుభఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాలూ ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా బాగా కలిసి వస్తుంది. ఆర్ధికంగా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. అవసరానికి మించి ధనం చేతికి అందుతుంది. పాత పరిచయాలు, స్నేహాలను పునరుద్ధరించుకునేందుకు, కొత్త పరిచయాలు పెంచుకునేందుకు ఇది మంచి సమయం. స్నేహితులు, బంధువులు రాకతో ఇంట్లో ఆహ్లాకదరమైన వాతావరణం ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. ఈశ్వరుని ఆలయ సందర్శన శుభకరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సంబంధాల పట్ల, స్నేహితుల విషయంలో సెంటిమెంట్, ఎమోషనల్​గా ఉండడం వల్ల ప్రతి చిన్న విషయానికి సందిగ్దతకు లోనవుతారు. ఎవరినీ ఇబ్బంది పెట్టలేక, మీరు ఇబ్బంది పడలేక ఊగిసలాడుతుంటారు. ఇతరుల ఆలోచనల కంటే మీ అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇస్తారు. దైవారాధన మీద మనసు లగ్నం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఆర్ధిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శివాలయం సందర్శిస్తే మేలు జరుగుతుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు ఈ రోజు చేపట్టిన పనిలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటారు. మీదైన శైలిలో పనిచేసి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. వ్యాపారంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. కుటుంబ కలహాలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శివ పంచాక్షరీ మంత్రం జపంతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కష్టించి పనిచేసే విజయాలను అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. మీ ప్రియమైన వారి కోసం అధికంగా ధనవ్యయం చేస్తారు. విహారయాత్రలకు వెళతారు. ఈ రోజంతా ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉన్నందున ఈ రోజు అన్ని రంగాలవారికి చేపట్టిన ప్రతిపనీ విజయవంతంగా పూర్తవుతుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లి ఆహ్లాదకరంగా గడుపుతారు. ఉద్యోగులు, వృత్తి నిపుణులు సంస్థ విజయాలలో కీలకంగా వ్యవహరిస్తారు. మీ పనితీరుకు పై అధికారుల ప్రశంసలు పొందుతారు. పరోపకార బుద్ధితో అందరినీ ఆకట్టుకుంటారు. సంపద వృద్ధి చెందుతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభకరం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి పరంగా గొప్ప శుభ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటారు. పని ప్రదేశంలో ఉన్నతాధికారుల నుంచి బహుమతులు, ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు మరికొంతకాలం వేచి చూస్తే మంచిది. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి పరంగా వ్యక్తిగతంగా ఎవరితోనూ గొడవలు పడవద్దు. అస్వస్థత కారణంగా బద్ధకంగా ఉంటారు. ఉద్యోగస్తులు పనులు సకాలంలో పూర్తి చేయడానికి సహోద్యోగుల సహకారం తీసుకుంటే మంచిది. మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త గా వ్యవహరించండి. ఖర్చులు పెరగవచ్చు. విదేశాల నుంచి శుభవార్త అందుకుంటారు. శనీశ్వరుని పూజిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనుకోకుండా అనైతికమైన కార్యకలాపాలలో ఇరుక్కోవడం మిమ్మల్ని ప్రమాదంలో పడవేస్తుంది. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ప్రతికూల ఆలోచనలతో వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం దెబ్బతినడంతో వైద్య ఖర్చులు పెరుగుతాయి. దానశీలత కలిగి ఉండడం, దైవంపై అచంచల విశ్వాసం కలిగి ఉండడం వల్ల మేలు చేకూరుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.