ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, కలెక్టర్ల బాధ్యతలను సీఎం కేసీఆర్ వివరిస్తున్నారు. సంక్షేమ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మిషన్ భగీరథ వల్ల తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైందని వెల్లడించారు.
భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వల్ల సాగునీటి వసతి కల్పించామని సీఎం అన్నారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియడం అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. కలెక్టర్లు ఎవరి ప్రాధాన్యాలు వారు ఎంచుకోవద్దని... అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యం ఉండాలని స్పష్టం చేశారు. ఒక టీమ్ లాగా అధికార యంత్రాంగం పనిచేయాలని... రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒకే ప్రాధాన్యతతో విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు.