ETV Bharat / city

CM KCR Gift to Mogilayya: పద్మశ్రీ మొగిలయ్యకు సీఎం భారీ నజరానా.. - సీఎం కేసీఆర్​ సత్కారం

CM KCR Announced 1 crore to Padma sri mogilayya

author img

By

Published : Jan 28, 2022, 9:01 PM IST

Updated : Jan 28, 2022, 9:32 PM IST

20:55 January 28

CM KCR Gift to Mogilayya: పద్మశ్రీ మొగిలయ్యకు సీఎం భారీ నజరానా..

CM KCR Gift to Mogilayya: పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు సీఎం కేసీఆర్​ భారీ నజరానా ప్రకటించారు. హైదరాబాద్​లో నివాసయోగ్యమైన స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం 1 కోటి రూపాయలను కేసీఆర్​ ప్రకటించారు. ఇటీవలే పద్మశ్రీ అవార్డు పొందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్య ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ను మర్యాదపూర్వకంగా కలిశారు.

తెలంగాణ గర్వించదగ్గ కళాకారుడు..

ఈ సందర్భంగా మొగిలయ్యను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించారు. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడని కొనియాడారు. ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని.. గౌరవ వేతనాన్ని కూడా అందిస్తోందని తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. కళాకారులను గౌరవించటంతో పాటు అన్ని రకాలుగా ఆదుకుంటామని కేసీఆర్​ పునరుద్ఘాటించారు.

ఎమ్మెల్యేకు సీఎం ఆదేశం..

పద్మశ్రీ మొగిలియ్యకు నివాసయోగ్యమైన ఇంటిస్థలంతో పాటు నిర్మాణానికి అయ్యే ఖర్చుగా.. కోటి రూపాయలను కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి మొగిలయ్యతో సమన్వయం చేసుకోవాలని.. కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో.. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు ఆల్ల వెంకటేశ్వర్ రెడ్డి, రెడ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Jan 28, 2022, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.