Jagan Review On Education: విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన జగన్.. సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండాలన్నారు. కొత్త విద్యావిధానం వల్ల 22 వేల మంది టీచర్లకు పదోన్నతి కల్పిస్తున్నామని సీఎం తెలిపారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వటంతో పాటు పదోన్నతులు, బదిలీలు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు.
జూన్ నాటికి విద్యావిధాన సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలన్నారు. ప్రతి మండలంలో 2 హైస్కూళ్లు, 2 కాలేజీలు ఉండాలని సూచించారు. ఎస్‌సీఈఆర్‌టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) సిఫారసులన్నీ అమల్లోకి రావాలని అధికారులను ఆదేశించారు. రీసోర్స్ సెంటర్‌ను మండల విద్యాశాఖాధికారి కార్యాలయంగా మార్పులు చేస్తూ.. ఎండీవో పరిధిలో కాకుండా ఎంఈవోకే డ్రాయింగ్ అధికారాలు ఇవ్వాలన్నారు. ఈ మేరకు అధికారులను ఎంఈవోకే అప్పగిస్తూ ఎస్‌సీఈఆర్‌టీ చేసిన సిఫారసుకు సీఎం ఆమోదం తెలిపారు. ఎంఈవో పోస్టుల భర్తీకి సీఎం జగన్ అంగీకారం తెలిపారు.
"విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలి. కొత్త విద్యావిధానం వల్ల 22 వేల మంది టీచర్లకు పదోన్నతి వస్తుంది. ఎస్‌జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వాలి. జూన్ నాటికి విద్యావిధాన సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలి. ప్రతి మండలంలో 2 హైస్కూళ్లు, 2 కాలేజీలు ఉండాలి. ఎస్‌సీఈఆర్‌టీ సిఫారసులన్నీ అమల్లోకి రావాలి. రీసోర్స్ సెంటర్‌ను మండల విద్యాశాఖాధికారి కార్యాలయంగా మార్పు. ఎండీవో పరిధిలో కాకుండా ఎంఈవోకే డ్రాయింగ్ అధికారాలు."
- జగన్, ముఖ్యమంత్రి
ఇదీ చూడండి: BJP Bheem Deeksha: 'కల్వకుంట్ల రాజ్యాంగం తేవాలని కేసీఆర్ కుట్ర'