ఏపీలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించిన సీఎం జగన్... తొలివిడత ప్రాధాన్యత ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఆరా తీశారు. నిర్ణీత లక్ష్యంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాల్సిందేనన్న సీఎం... కాఫర్ డ్యాం వల్ల ముంపునకు గురికాకుండా చూడాలన్నారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేయాలని సూచించారు. నిర్దేశిత ప్రణాళిక మేరకు ఆర్‌అండ్‌ఆర్ పనులు చేపట్టాలన్నారు.
ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపైనా ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. వంశధార పెండింగ్ పనులను జులై నాటికి పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. జూన్ కల్లా వంశధార-నాగావళి అనుసంధాన పనులు పూర్తి చేస్తామన్నారు. రెండోవిడత ప్రాధాన్యత ప్రాజెక్టుల కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రెండో విడతలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపైనా దృష్టి సారించాలన్నారు. రాయలసీమ, పల్నాడు ప్రాజెక్టులకు ఆర్థిక సంస్థలతో అంగీకారం కుదుర్చుకున్నామని అధికారులు.. సీఎంకు వివరించారు. మిగిలిన ప్రాజెక్టుల నిధుల సమీకరణపైనా దృష్టి పెట్టామన్నారు.
ఇవీచూడండి: సాంకేతిక పరిజ్ఞానంతో అనేక సవాళ్లకు పరిష్కారం: కేటీఆర్