ETV Bharat / city

YSR kapunestham: "వైఎస్సాఆర్​ కాపు నేస్తం' నిధుల విడుదల

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేస్తున్నామని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రెండో ఏడాది నిధులు విడుదల చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్‌ మీట నొక్కి 3.27లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రూ.490.86 కోట్లు జమ చేశారు.

YSR kapunestham
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి
author img

By

Published : Jul 22, 2021, 2:01 PM IST

Updated : Jul 22, 2021, 2:29 PM IST

వైఎస్సార్‌ కాపు నేస్తం పథకానికి (ysr Kapu Nestam scheme) సంబంధించి రెండో ఏడాది నిధులు.. ఏపీ సీఎం జగన్​ విడుదల చేశారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 15 వేల చొప్పున జమ అయ్యాయి. ఈ పథకం ద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఆర్థిక సాయం అందింది. ఒక్క రూపాయి అవినీతి లేకుండా, వివక్ష లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ప్రతి లబ్దిదారుడికీ మంచి జరగాలని లక్ష్యంగా పెట్టుకుని పథకాలు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

'ఐదేళ్లలో మొత్తం రూ.75 వేల చొప్పున లబ్ధిదారులకు ఆర్థికసాయం అందిస్తాం. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాన్ని అమలు చేస్తున్నాం. మహిళా స్వావలంబన అనే గొప్ప ఆలోచన నుంచి పుట్టిన కార్యక్రమం వైఎస్ఆర్ కాపు నేస్తం. మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పాత బకాయిలకు కాపు నేస్తం నగదు జమ చేసుకోకూడదని బ్యాంకులను ఆదేశించాం. రెండేళ్లలో కాపునేస్తం ద్వారా రూ.982 కోట్లు జమ చేశాం.'- ఏపీ సీఎం జగన్​

నిధుల విడుదలతో... అర్హులైన 3 లక్షల 27వేల 244 మంది పేద మహిళలకు.. 490.86 కోట్ల ఆర్థిక సాయం అందింది. అయితే.. కొన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకుంటున్నాయన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏటా రూ. 15 వేల చొప్పున 5 ఏళ్లలో మొత్తం రూ. 75 వేల సాయం అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి: Telangana Rains: ప్రజలెవ్వరూ ఇళ్లలో నుంచి బయటకురావద్దు: సీఎం కేసీఆర్​

Last Updated : Jul 22, 2021, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.