ETV Bharat / city

Milan-2022: సాగర రక్షణలో మరో అధ్యాయం మొదలైంది: సీఎం జగన్

author img

By

Published : Feb 27, 2022, 7:37 PM IST

Milan-2022: నౌకాదళంలో 'ఐఎన్‌ఎస్‌ విశాఖ', 'ఐఎన్‌ఎస్‌ వేల' చేరికతో సాగర రక్షణలో మరో అధ్యాయం మొదలైందని ఏపీ సీఎం జగన్ అన్నారు. విశాఖ తీరంలో జరుగుతున్న మిలాన్ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి.. నౌకల విన్యాసాలు విశాఖ ప్రజలకు ఉత్సాహాన్నిస్తాయన్నారు.

Milan-2022
మిలాన్ 2022

Milan-2022: విశాఖ చరిత్రలో నిలిచిపోయే విధంగా మిలాన్‌ వేడుకలు జరుగుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. విశాఖ తీరంలో జరుగుతున్న మిలాన్ వేడుకలకు హాజరైన సీఎం.. వేడుకల్లో 39 దేశాలు పాల్గొంటున్నాయని తెలిపారు. 'ఐఎన్‌ఎస్‌ విశాఖ', 'ఐఎన్‌ఎస్‌ వేల' చేరికతో సాగర రక్షణలో మరో అధ్యాయం మొదలైందన్నారు. విన్యాసాలతో సైనిక శక్తిపై మరింత విశ్వాసం పెంపొందుతుందని జగన్ వెల్లడించారు.

"విశాఖ చరిత్రలో నిలిచిపోయే విధంగా మిలాన్‌ వేడుకలు జరుగుతున్నాయి. మిలాన్‌ వేడుకల్లో 39 దేశాలు పాల్గొంటున్నాయి. నౌకాదళ విన్యాసాలకు విశాఖ సాగరతీరం వేదికైంది. ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం నౌక ఇటీవలే నౌకాదళంలో చేరింది. నౌకపై లైట్‌ హౌస్‌, డాల్ఫిన్‌ నోస్‌, కృష్ణ జింకను చిత్రించారు. ఇటీవలే 'ఐఎన్‌ఎస్‌ వేల' సబ్‌మెరైన్‌ నౌకాదళంలో చేరింది. సబ్‌మెరైన్‌ రాకతో ఈ ప్రాంత రక్షణలో మరో అధ్యాయం మొదలైంది. నౌకల విన్యాసాలు విశాఖ ప్రజలకు ఉత్సాహం ఇస్తాయి. విన్యాసాలతో సైనిక శక్తిపై మరింత విశ్వాసం పెంపొందుతుంది." -ముఖ్యమంత్రి జగన్​

అంతర్జాతీయ సిటీ పరేడ్‌..

మిలాన్‌-2022 వేడుకల్లో భాగంగా అంతర్జాతీయ సిటీ పరేడ్‌ నిర్వహిస్తున్నారు. ఆర్కే బీచ్‌ నుంచి విన్యాసాలు సీఎం జగన్‌, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ హరికుమార్‌, మంత్రులు విన్యాసాలను వీక్షిస్తున్నారు. సిటీ పరేడ్‌లో 13 దేశాల యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. 50కి పైగా విమానాలు, హెలికాప్టర్లతో విన్యాసాలు నిర్వహిస్తున్నారు. సముద్రంపై నావికుల సాహస కృత్యాలు, శత్రు స్థావరాలను చేజిక్కించుకునే విన్యాసాలు, సముద్రం మధ్యలో చిక్కుకున్నవారిని రక్షించే విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఐఎన్‌ఎస్‌ విశాఖ జాతికి అంకితం..

అంతకు ముందు.. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం విశాఖ చేరుకున్న సీఎం జగన్.. నేరుగా తూర్పు నౌకాదళ కేంద్రానికి వెళ్లారు. నౌకాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఐఎన్‌ఎస్‌ -విశాఖ నౌకను జాతికి అంకితం చేశారు. ఐఎన్‌ఎస్‌ -విశాఖ నౌక పశ్చిమ నౌకాదళంలో సేవలందించనుంది.

ఇదీ చదవండి: Pk Meet Cm Kcr: రాష్ట్రంలో పీకే పర్యటన... ఆసక్తిగా మారిన సీఎం భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.