CM Jagan on Party strengthening: మంత్రులు, వైకాపా జిల్లా అధ్యక్షులతో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. వైకాపా రీజినల్ కో ఆర్డినేటర్లతోనూ భేటీ అయిన జగన్ పలు అంశాలపై వైకాపా నేతలకు దిశానిర్ధేశం చేస్తున్నారు. పార్టీలో అసమ్మతి స్వరాలు, వర్గ విభేదాల దృష్ట్యా కీలక భేటీ నిర్వహించారు. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం, ఇతర అంశాలపై చర్చించారు. మాజీ మంత్రులు, జిల్లా అధ్యక్షుల మధ్య సమన్వయంపై దిశానిర్దేశం చేశారు.
మే 2 నుంచి 'ఇంటింటికి వైకాపా' కార్యక్రమం నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. పార్టీ ఆదేశాలు ధిక్కరించిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కవని... వైకాపా అధినేత జగన్ హెచ్చరించారు. సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై దిశానిర్దేశం చేసిన జగన్... మంత్రివర్గ విస్తరణలో చోటు ఆశించి భంగపడిన అసంతృప్త నేతలను సముదాయించారు. విభేదాలు వీడి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఎవరూ బహిరంగ విమర్శలు చేయొద్దన్న జగన్... ప్రజాప్రతినిధులు పని తీరు మెరుగుపరుచుకోవాలని చెప్పారు. త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తానని సమావేశంలో సీఎం చెప్పారు.
ఇవీ చదవండి: