CJI justice NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గౌరవార్థం.. ఏపీ ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన తేనీటి విందు కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్, మంత్రులు, ఏపీ, తెలంగాణ హైకోర్టుల న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తేనీటి విందులో సీజేఐకి.. రాష్ట్ర మంత్రులను ముఖ్యమంత్రి జగన్ పరిచయం చేశారు.
AP CM Jagan Meets CJI: అంతకు ముందు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులను.. సీఎం జగన్ దంపతులు కలిశారు. విజయవాడ నోవాటెల్ హోటల్‌లో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు.. సీఎం జగన్ దంపతులు పుష్పగుచ్ఛం అందించారు.
ఇదీ చదవండి
CJI NV Ramana: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు